
8 మంది బాధిత కుటుంబాలను ప్రభుత్వం తరఫున ఆదుకుంటాం: సీఎం రేవంత్
SLBC టన్నెల్లో 11 కేంద్ర, రాష్ట్ర సంస్థలు రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొన్నాయని సీఎం రేవంత్ తెలిపారు. 'తీవ్రంగా శ్రమిస్తున్న రెస్క్యూ సిబ్బందిని అభినందిస్తున్నా. ఆపరేషన్ పూర్తికి మరో 2, 3 రోజులు పట్టే అవకాశం ఉంది. ప్రమాదం జరిగిన వెంటనే మంత్రులను పంపించి ఎప్పటికప్పుడు సమీక్ష చేశా. కన్వేయర్ బెల్ట్ సిద్ధం అయితే లోపల ఉన్న మట్టి, బురద తరలించడం ఈజీ అవుతుంది. 8 మంది బాధిత కుటుంబాలను ప్రభుత్వం తరఫున ఆదుకుంటాం' అని హామీ ఇచ్చారు.