తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగిన ఉమ్మడి మెదక్, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, నల్గొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో రేపు కౌంటింగ్ సందర్భంగా పాఠశాలలకు, కాలేజీలకు సెలవు ఇవ్వాలని రాష్ట్ర సర్కార్ ఇటీవల ఆదేశించింది. పలుచోట్లు సెలవు ఇవ్వలేదని విద్యార్థులు, పేరెంట్స్ ఆరోపిస్తున్నారు. అటు ఏపీలో అవసరమైతేనే సెలవు ఇవ్వాలని ఈసీ ఆదేశించింది. దీంతో కౌంటింగ్ జరిగే చోటే సెలవు ఉండే అవకాశం ఉంది.