ఏపీలోని అంబేడ్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలో నడిరోడ్డుపై ఎలక్ట్రికల్ బైక్ దగ్ధమైంది. పార్క్ చేసి ఉన్న బ్యాటరీ వాహనం నుంచి ఒక్కసారిగా పొగలు చిమ్ముతూ మంటలు చెలరేగడంతో స్థానికులు కంగారుపడి పరుగులు తీశారు. పశ్చిమ గోదావరి జిల్లా మార్టేరుకు చెందిన సత్తి పెద్దిరెడ్డి అనే వ్యక్తి ‘ఆరా’ కంపెనీకి చెందిన ఈ బైక్‌ను పార్క్ చేశాడు. అయితే, అందులోంచి ఒక్కసారిగా మంటలు చెలరేగి బైక్ పూర్తిగా దగ్ధమైంది.