క్రికెట్ ఆడుతుండగా ఘర్షణ.. వికెట్లతో దాడి
AP: క్రికెట్ ఆడుతుండగా యువకుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. దాంతో వారు వికెట్లతో ఒకరిపై దాడికి దిగారు. ఈ ఘటన అన్నమయ్య జిల్లా నందలూరు మండల కేంద్రంలో జరిగింది. కరిముల్లా (35)ను 11 మంది యువకులు చితకబాదారు. కరిముల్లాకు తీవ్ర గాయాలయ్యాయి. అంబులెన్స్‌లో కడప రిమ్స్‌కు తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు 11 మందిలో తొమ్మిది మందిని అదుపులోకి తీసుకున్నారు. దర్యాప్తు జరుగుతోంది.