హ్యూమన్ మెటాన్యూమో వైరస్ (HMPV)పై కేంద్ర వైద్యారోగ్య శాఖ మంగళవారం రివ్యూ నిర్వహించింది. కేసులను గుర్తించేందుకు నిఘా పెట్టాలని, నివారణ చర్యలపై ఫోకస్ పెట్టాలని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది. 2001 నుంచి ఈ వైరస్ ఉందని, ప్రజలు భయాందోళనకు గురికావొద్దని పేర్కొంది. శీతాకాలంలోనే ఈ కేసులు పెరుగుతాయని తెలిపింది. ఈ వైరస్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామంది. తరచూ చేతులు కడుక్కోవాలని, మాస్క్ ధరించాలని పేర్కొంది.