AP: విశాఖ పర్యటనలో ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్న గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్‌తో త్వరలో విద్యుత్ ఛార్జీలు తగ్గుతాయని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. గత ప్రభుత్వ హయాంలో విద్యుత్ ఉత్పత్తి సరఫరా వ్యవస్థలు నిర్వీర్యం అయ్యాయని మండిపడ్డారు. మంగళవారం మోదీ సభా ప్రాంగణాన్ని పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల కోరికైన రైల్వేజోన్‌కు బుధవారం ప్రధాని మోదీ శంకుస్థాపన చేస్తారన్నారు.