ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాజీవ్ కుమార్ మంగళవారం ప్రకటించారు. ఢిల్లీలో నేటి నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి రానుంది. ఫిబ్రవరి 23తో ఢిల్లీ అసెంబ్లీ పదవీకాలం ముగియనుండడంతో ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించారు. ఢిల్లీలోని మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. అందులో 58 జనరల్ స్థానాలు, మరో 12 ఎస్సీ స్థానాలు ఉన్నట్లు సీఈవో వెల్లడించారు. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహిస్తున్నామని తెలిపారు.