ఖైరతాబాద్ గణేశుడికి భారీగా విరాళాలు.. రూ.1 కోటి దాటిన ఆదాయం
ఖైరతాబాద్ మహాగణపతి హుండీలో విరాళాల వర్షం కురిసింది. ఎన్నడూ లేనంత స్థాయిలో భారీగా హుండీ ఆదాయం వచ్చి చేరింది. కేవలం హుండీ కానుకల ద్వారానే 70 లక్షల ఆదాయం వచ్చినట్లు అధికారులు సోమవారం వెల్లడించారు. ఇక మహాగణపతికి సంబంధించిన హోర్డింగ్లు, ప్రకటనల ద్వారా మరో రూ.40 లక్షలు ఆదాయం సమకూరినట్లు చెప్పారు. దీనికితోడు ఆన్లైన్ ద్వారా విరాళాల సేకరణ జరిగింది. అంటే.. ఈసారి ఖైరతాబాద్ మహా గణపతికి రూ.కోటికిపైనే ఆదాయం వచ్చింది.