Top 10 viral news 🔥
కంటతడి పెట్టిస్తున్న వానరం వీడియో
ఓ కోతి పిల్ల తల్లి కోతి వద్ద తల్లడిల్లిన వీడియో కంటతడి పెట్టిస్తోంది. ఖమ్మం జిల్లా సత్తపల్లిలో కొందరు ఆహారంలో విషం కలిపి పెట్టడంతో 15 కోతులు నురగలు కక్కుతూ కుప్పకూలాయి. ఓ కోతి పిల్ల తన తల్లి చనిపోయిందనే విషయం తెలియక ఏడ్చి ఏడ్చి కాసేపటికి ప్రాణాలు వీడిచింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కోతులకు విషం పెట్టిన వాళ్లపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఫారెస్ట్ అధికారులు ఏం చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి.