రేపే జమ్మూకశ్మీర్, హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు (వీడియో)

51చూసినవారు
జమ్మూకశ్మీర్‌, హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మంగళవారం ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇందుకోసం లెక్కింపు కేంద్రాల వద్ద మూడంచెల భద్రతను ఏర్పాటు చేసినట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. కాగా, హర్యానా, జమ్మూకశ్మీర్‌లలో ‘హస్తం’ జోరు కొనసాగే అవకాశాలు ఉన్నాయని ఇప్పటికే పలు ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలు వేశాయి. అయినప్పటికీ గెలుపుపై ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్