తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్ వేదికగా విమర్శల వర్షం గుప్పించారు. పనిమంతుడు పందిరేస్తే.. పిల్లితోక తగిలి కూలిందన్నట్లు ఉందని ఎద్దేవా చేశారు. తెలంగాణకు గుండెలాంటి హైదరాబాద్‌ను కాపాడుకోవడం చేతకాక, సామాన్యులపై బుల్డోజర్లు పంపి భయాన్ని సృష్టిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశాడు. హైడ్రా హైరానాతో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పడిపోయిందని, తద్వారా రాష్ట్రానికి ఆదాయం తగ్గిందని పేర్కొన్నారు.