మామూలు రోజులతో పోలిస్తే పండుగ పూట పెట్రోలింగ్ పెంచాలి. ప్రత్యేక నేర బృందాలు పాత నేరస్థులను గుర్తించి, వారికి ముందస్తుగా కౌన్సెలింగ్ ఇవ్వాలి. జైలు నుంచి విడుదలైన పాత నేరస్థుల కదలికలపై సైతం పటిష్ఠ నిఘా ఉంచాలి. ప్రజల్లో దొంగతనాల పట్ల అవగాహన పెంచే కార్యక్రమాలు నిర్వహించాలి. సివిల్ డ్రెస్సులో గస్తీ కాసి.. అనుమతులను ప్రశ్నించాలి. దొంగతనానికి రావాలంటే దొంగలకు భయం వేసేలా చేయాలి.