కాలనీల్లో వాలంటరీ కమీటీలను ఏర్పాటు చేసుకోవాలి. పోలీసులకు అందుబాటులో ఉండాలి. కాలనీలో అనుమానాస్పదంగా, గుర్తుతెలియని వ్యక్తులు కనిపిస్తే వెంటనే డయల్ 100కు ఫోన్ చేసి, సమాచారం అందించాలి. అపార్ట్‌మెంట్‌ల వద్ద సాధ్యమైనంత వరకు నమ్మకమైన వాచ్‌మెన్‌ను నియమించుకోవాలి. ఇంట్లో చీకటి ఉండకుండా లైట్స్‌ను ఆన్‌లో పెట్టి ఉంచాలి.