బతుకమ్మ వేడుకల్లో విషాదం.. షాక్ కొట్టి వ్యక్తి మృతి (వీడియో)

69చూసినవారు
బతుకమ్మ పండుగ వేడుకల్లో విషాదం నెలకొంది. వరంగల్ జిల్లా నెక్కొండ మండలం అలంకానిపేట గ్రామంలో బతుకమ్మ వేడుకల కోసం ఏర్పాటు చేసిన విద్యుత్ లైట్లు తగిలి చీకటి యాకయ్య (45) అనే వ్యక్తి మృతి చెందాడు. యాకయ్య చేతిలో చిన్నారి ఉండగా.. అదృష్టవశాత్తు చిన్నారి ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ దృశ్యాలు కారు డాష్ క్యామ్ లో రికార్డ్ అయ్యాయి. విద్యుత్ లైట్లు కింద నుండి వెళ్తుండగా వైర్లు తగిలి ప్రమాదం జరిగిందని గ్రామస్తులు తెలిపారు.

సంబంధిత పోస్ట్