బుల్లితెర హీరో మానస్ గుడ్ న్యూస్ చెప్పారు. ఆయన గత ఏడాది శ్రీజను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈ ఏడాది జులైలో భార్య ప్రెగ్నెన్సీ విషయాన్ని ప్రకటించారు. ఇప్పుడు మానస్ మరో గుడ్ న్యూస్ అనౌన్స్ చేశారు. తనకు బాబు పుట్టినట్టు తెలుపుతూ ఫొటోలు షేర్ చేశారు. అయితే తన కొడుకుకు ‘ధ్రువ’’ అని పేరు పెట్టినట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.