వేయించిన శనగలు తిని ఇద్దరు మృతి

63చూసినవారు
వేయించిన శనగలు తిని ఇద్దరు మృతి
యూపీలోని బులంద్‌షహర్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. వేయించిన శనగలు తిని ఇద్దరు మృతి చెందగా మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. బర్వాలా గ్రామానికి చెందిన కలువా (49) అనే వ్యక్తి ఆదివారం దౌలత్‌పూర్ నుండి కాల్చిన శనగలతో ఇంటికి వచ్చాడు. వాటిని తిన్న నలుగురు కుటుంబ సభ్యులకు కడుపునొప్పి, వాంతులు అయ్యాయి. స్థానికులు వెంటనే వారిని ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ కలువా అతని మనుమడు గోలు మృతిచెందారు.

సంబంధిత పోస్ట్