పేలిన రెండు ఐస్ క్రీం బాంబులు

78చూసినవారు
పేలిన రెండు ఐస్ క్రీం బాంబులు
కేర‌ళ‌ కన్నౌరులోని అంచర్కాండిలో ఇవాళ బాంబు పేలుడు ఘ‌ట‌న చోటుచేసుకున్న‌ది. తెల్ల‌వారుజామున 3 గంట‌ల‌కు రోడ్డుపై వేసిన రెండు ఐస్‌క్రీమ్ బాంబులు పేలాయి. ఐస్ క్రీం షేప్‌లో ఉన్న కంటేన‌ర్‌తో చేసిన పేలుడు ప‌దార్ధాల‌ను ఐస్ క్రీం బాంబు అని పిలుస్తారు. అయితే ఆ బాంబు పేలుళ్ల‌కు పాల్ప‌డిన వ్య‌క్తుల‌ను అరెస్టు చేసేందుకు విచార‌ణాధికారులు వెళ్తున్నారు. పోలీసు క్యాంపున‌కు కొన్ని మీట‌ర్ల దూరంలోనే పేలుడు ఘ‌ట‌న జ‌రిగింది.

ట్యాగ్స్ :