VIDEO: లాంచ్‌ప్యాడ్‌ పైనే పేలిపోయిన జపాన్‌ రాకెట్‌

52చూసినవారు
జపాన్‌ స్పేస్‌ ఏజెన్సీ చేపట్టిన రాకెట్‌ ఇంజిన్‌ పరీక్ష ఘోరంగా విఫలమైంది. మంగళవారం ఉదయం ఎప్సిలాన్‌ ఎస్‌ రాకెట్‌ ఇంజిన్‌ పేలి దహనమైపోయింది. నైరుతి జపాన్‌లోని తనెగాషిమా స్పేస్‌ సెంటర్‌లో చోటుచేసుకొన్న ఈ ప్రమాదంలో ప్రాణనష్టానికి సంబంధించి ఎటువంటి సమాచారం లేదు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కొండ చాటున భారీ పేలుడు చోటుచేసుకొని మంటలు ఎగసిపడుతున్నట్లు వీడియోలో కనిపిస్తుంది.
Job Suitcase

Jobs near you