రంగారెడ్డి: భక్తి శ్రద్ధలతో కార్తీకమాస పూజలు

59చూసినవారు
రంగారెడ్డి: భక్తి శ్రద్ధలతో కార్తీకమాస పూజలు
జిల్లా వ్యాప్తంగా కార్తీక మాసం వేడుకలు ఘనంగా నిర్వహించారు. పలు ఆలయాల్లో సోమవారం తెల్లవారుజాము నుంచే భక్తులు దీపాలు వెలిగించి పూజలు నిర్వహించారు. గోషామహల్, శంకర్ బాగ్, ఆసిఫ్ నగర్, ఆగాపురా, గుడిమల్కాపూర్ శివాలయాల్లో పెద్ద ఎత్తున కార్తీక మాసం సందడి నెలకొంది. సాయంత్రం గుడిమల్కాపూర్ శివాలయంలో ఆకాశగంగ దీపాలంకరణ, పల్లకీ సేవ నిర్వహించారు.