వికారాబాద్: మాజీ ఎమ్మెల్యే పట్నం సతీమణిని పరామర్శించిన నేతలు
వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచర్ల దాడి ఘటనలో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి గత నెల రోజులుగా రిమాండ్ లో ఉన్నారు. శనివారం హైదరాబాద్ లోని ఆయన నివాసంలో సతీమణి శృతి రెడ్డిని మాజీ జెడ్పీటీసీ లు ప్రమోదిని, సుజాత, అరుణాదేశు, నర్మదా, శకుంతల, అనురాధ, శోభ, నాగరాణి, హరిప్రియ, కోట్ల మహిపాల్ ముదిరాజ్, చాంద్ పాషా తదితరులు పరామర్శించి ధైర్యం చెప్పారు.