ఏపీలో ప్రొఫెషనల్ గోల్ఫ్ అసోసియేషన్ ఆఫ్ అమెరికా (PGA) ప్రామాణిక గోల్ఫ్ సిటీ ఏర్పాటుకు గల అవకాశాలను పరిశీలించాల్సిందిగా స్టోన్ క్రాఫ్ట్ గ్రూప్ ప్రతినిధులను మంత్రి నారా లోకేష్ కోరారు. జ్యురిచ్ వెళ్లిన మంత్రి లోకేష్‌తో సోమవారం స్టోన్ క్రాఫ్ట్ గ్రూపు ప్రతినిధులు భేటీ అయ్యారు. పూర్తిస్థాయి బ్లూప్రింట్ తో వస్తే 15 రోజుల్లో ఏపీ ఎకనమిక్ డెవలప్‌మెంట్ బోర్డు అన్ని అనుమతులు మంజూరు చేస్తుందని మంత్రి లోకేష్ తెలిపారు.