యూట్యూబ్‌లో దూసుకుపోతున్న ‘గోదారి గట్టు మీద రామచిలుకవే’ (వీడియో)
‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రంలోని ‘గోదారి గట్టుమీద రామచిలకవే’ పాట యూట్యూబ్‌లో దూసుకుపోతోంది. యూట్యూబ్‌లో 100 మిలియన్లు దాటేసిన ఈ పాటకు ఇప్పుడు థియేటర్‌కు వెళ్లిన ప్రేక్షకులు లేచి మరీ చిందులు వేస్తున్నారు. ఇప్పటికే యూట్యూబ్, ఇన్‌స్టా రీల్స్‌ను ఓ ఊపు ఊపేసిన ఈ పాటను వందలాది మంది రీక్రియేట్ చేశారు. భీమ్స్ సిసిరోలియో స్వరాలు సమకూర్చిన ఈ పాటకు భాస్కరభట్ల సాహిత్యం అందించగా, రమణగోగుల, మధుప్రియ ఆలపించారు.