కాలేజీ గ్రౌండ్ లోనే ఒకరిపై ఒకరు దాడి చేసుకున్న విద్యార్థులు (వీడియో)
కాలేజీకి వెళ్ళి చదువుకోవాల్సిన విద్యార్థులు గొడవలు పడుతూ తమ తల్లి దండ్రుల గౌరవాన్ని చెడగొడుతున్నారు. ఇదే కోవలో డెహ్రాడూన్లోని ఓ ప్రముఖ డిగ్రీ కళాశాలలో రెండు గ్రూపులు దాడికి దిగాయి. కాలేజీ ప్రాంగణంలో ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటున్న వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇద్దరు యువకులు ఒకరిపై ఒకరు పిడిగుద్దుల కురిపించుకోవడం వీడియోలో కనిపించింది. అయితే పోలీసులు వీరిని గమనించి వచ్చేలోపే విద్యార్థులు పారిపోయారు. ఈ ఘటనకు గల కారణాలు తెలియరాలేదు.