Sep 16, 2024, 12:09 IST/వనపర్తి
వనపర్తి
పండగలు మతసామరస్యానికి ప్రతీకలు: ఎమ్మెల్యే మేఘారెడ్డి
Sep 16, 2024, 12:09 IST
మన సంస్కృతికి సాంప్రదాయాలకు ఆనవాలైన పండగలు మతసామరస్యానికి ప్రతీకలని పండగలు నిర్వహించుకోవడం వల్ల మనుషుల మధ్య ఐక్యత నెలకొంటుందని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. మహమ్మద్ ప్రవక్త జన్మదిన సందర్భంగా ముస్లిం సోదరులు నిర్వహించుకునే "మిలాద్ ఉన్ నబి" సందర్భంగా సోమవారం వనపర్తి పట్టణంలోని గాంధీచౌక్ లో గల మహమ్మదీయ మసీదులో చేపట్టిన ప్రత్యేక ప్రార్థనలో పాల్గొని ముస్లిం సోదరులకు పండగ శుభాకాంక్షలు తెలియజేశారు.