దేవరకద్ర నియోజకవర్గం
ముఖ్యమంత్రి రాకకు హెలిపాడ్ ను పరిశీలించిన జిల్లా ఎస్పీ
దేవరకద్ర ఏమ్మెల్యే మధుసూదన్ రెడ్డి తండ్రి కృష్ణా రెడ్డి ఇటీవల మృతి చెందారు. ఈ సందర్భంగా ఆదివారం చిన్నచింతకుంట మండలం దమగ్నాపూర్ లో జరగనున్న కృష్ణారెడ్డి దశదినకర్మకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రానున్నారు. ఈ మేరకు శుక్రవారం మహబూబ్ నగర్ ఎస్పీ జానకి ధరావత్ హెలిపాడ్ కోసం భూ పరిశీలన చేశారు. ఈ కార్యక్రమంలో సీఐ, జిల్లా కిసాన్ అధ్యక్షులు నాగిరెడ్డి, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.