పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో వక్ఫ్ చట్టం సవరణ బిల్లును ప్రవేశపెట్టింది. ఈ బిల్లును తాజాగా విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. రాజ్యాంగ విరుద్ధం అంటూ ఖండించింది. కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ మాట్లాడుతూ..‘‘ ఈ బిల్లు దారుణం. రాజ్యాంగ స్ఫూర్తిపై దాడి. ఇది మతపరమైన విభజనను సృష్టిస్తుంది’’ అని విమర్శించారు. ఈ సవరణ బిల్లును బీజేపీ మిత్రపక్షం జేడీయూ సమర్థించింది.