Dec 30, 2024, 12:12 IST/
భారత్‌లో అత్యంత ధనవంతులైన యూట్యూబర్స్ వీరే!
Dec 30, 2024, 12:12 IST
టెక్నికల్ గురూజీగా ప్రసిద్ధి చెందిన గౌరవ్ చౌదరి భారతదేశంలనే అత్యంత ధనిక యూట్యూబర్. ఆయన సంపద రూ.356 కోట్లుగా అంచనా. దాదాపు రూ.122 కోట్ల సంపదతో 2వ స్థానంలో ‘బీబీ కి వైన్స్’ పేరుతో యూట్యూబ్ ఛానెల్‌ని నడుపుతున్న భువన్ బామ్ ఉన్నారు. దాదాపు రూ.80 కోట్ల సంపదతో 3వ స్థానంలో అమిత్ భదానా ఉన్నారు. దాదాపు రూ.50 కోట్ల సంపదతో ‘క్యారీమినాటి’ అజయ్ నగర్ 4వ స్థానంలో ఉన్నారు. దాదాపు రూ. 43 కోట్ల సంపదతో 5వ స్థానంలో నిషా మధులిక ఉన్నారు.