AP: కోనసీమ జిల్లా అమలాపురం బాలయోగి స్పోర్ట్స్ గ్రౌండ్‌లో మందపాటి ఆదిత్య అనే యూట్యూబర్‌కు ఓవరాక్షన్ చేశారు. తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో గోల్డ్ హంట్ పేరుతో ఓ ప్రకటన చేశారు. ఫస్ట్ ప్రైజ్ కింద గోల్డ్, సెకండ్ ప్రైజ్ కింద వెండి ఉంగరం, థర్డ్ ప్రైజ్ కింద ఇయర్ బడ్స్‌ను భూమిలో పాతిపెట్టి.. కనుగొన్న వాళ్లకే సొంతమని చెప్పారు. ఆ వీడియో నెట్టింట వైరలయింది. దాదాపు 200 మంది చేరుకుని గ్రౌండ్‌లో గుంతలు తవ్వారు. ఆదిత్య తీరుపై నెట్టింట ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.