జనగాంకు రానున్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్

592చూసినవారు
జనగాంకు రానున్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్
బిఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జిల్లా కేంద్రమైన జనగాం నగరానికి రానున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. శనివారం వారు మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 25వ తేదీన భువనగిరి పార్లమెంట్ పరిధిలోని జనగామ నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించే రోడ్ షోలో పాల్గొని బిఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలని జనగాం ప్రజలను కోరనున్నట్లు తెలిపారు.