
దేవరుప్పుల: రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్రగాయాలు
ఎదురెదురుగా వస్తున్న ఓ ట్రాక్టర్, ద్విచక్ర వాహనం ఢీకొన్న ఘటనలో ఇద్దరికీ తీవ్ర గాయాలయిన ఘటన జనగామ జిల్లా దేవరుప్పుల మండలం మాదాపురం గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం. ఆదివారం రాత్రి చౌడూరు గ్రామానికి చెందిన వారు ద్విచక్ర వాహనంపై దేవునిగుట్ట తండా నుంచి చౌడూరుకు వెళ్తున్న క్రమంలో మాదాపురం పోచమ్మ గుడి వద్ద ఈ ప్రమాదం జరిగినట్లు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.