మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో లగచర్ల సంఘటనపై బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన మహా ధర్నా కార్యక్రమంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రమైన జనగాం నియోజకవర్గ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి హాజరై సంఘీభావం ప్రకటించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ, ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.