
కాజీపేట రైల్వే స్టేషన్లో గంజాయి కలకలం
కాజీపేట రైల్వే స్టేషన్లో 4 కిలోల గంజాయి బ్యాగ్ ను పోలీసులు మంగళవారం గుర్తించారు. గంజాయి గురించి సమాచారం అందుకున్న ఆంటీ డ్రగ్స్ కంట్రోల్ టీం పోలీసులు పోలీస్ జాగిలాలతో తనిఖీలు నిర్వహించారు. దీంతో రహస్యంగా దాచిన గంజాయి బ్యాగ్ ను పోలీస్ జాగిలం గుర్తించగా.. పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.