Oct 14, 2024, 11:10 IST/
భారీ వర్షాల నేపథ్యంలో టీటీడీ కీలక నిర్ణయాలు
Oct 14, 2024, 11:10 IST
బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో రానున్న మూడు రోజుల ఏపీ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా శ్రీవారి ఆలయంలో 16న వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేసింది. 15న సిఫార్సు లేఖలు అనుమతించకూడదని నిర్ణయం తీసుకుంది. అలాగే భక్తుల భద్రత దృష్ట్యా బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.