Oct 15, 2024, 05:10 IST/వర్ధన్నపేట
వర్ధన్నపేట
వర్ధన్నపేటలో మత్స్య కారుల నిరసన
Oct 15, 2024, 05:10 IST
వర్ధన్నపేట కొత్తపెల్లి గ్రామంలో ఉచిత చేప పిల్లలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మత్స్యకారులు నిరసన, ధర్నా చేపట్టారు. సత్యనారాయణ ఫిషరీస్ చేప పిల్లల పంపిణీ సంస్థ ప్రభుత్వం ఇచ్చిన సరైన ప్రమాణాల మేరకు చేప పిల్లలను ఇవ్వటం లేదని మత్స్యకారులు ఆరోపిస్తూ నిరసన తెలిపారు. వర్ధన్నపేట, పర్వతగిరి, రాయపర్తి మండలాలకు చెందిన దాదాపు 68 సొసైటీల గ్రామాలకు చెందిన మత్స్యకార సొసైటీ సభ్యులు వెనుతిరిగి వెళ్లారు.