Nov 23, 2024, 07:11 IST/
ప్రియాంక గాంధీపై జాతీయ జనసేన అధ్యక్షుడు పోటీ
Nov 23, 2024, 07:11 IST
కేరళలోని వయనాడ్ లోక్సభ స్థానానికి పోటీచేసిన కాంగ్రెస్ అభ్యర్థి ప్రియాంక గాంధీ గెలుపుదిశగా దూసుకుపోతున్నారు. అయితే వయనాడ్లో ప్రియాంకపై పోటీ చేసినవారిలో ఓ తెలుగు వ్యక్తి కూడా ఉన్నారు. ఆయనే ఏపీలోని తిరుపతికి చెందిన దుగ్గిరాల నాగేశ్వరరావు. ఆయన జాతీయ జనసేన పార్టీకి జాతీయ అధ్యక్షుడిగా పని చేస్తున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా అనే అంశంపై పోరాడే ఉద్దేశంతోనే జాతీయ స్థాయిలో పోటీ చేస్తున్నట్లు నాగేశ్వరరావు వెల్లడించారు.