కిషంత్ నాయక్ దుంగస్ఖల్ గ్రామం గజపతి జిల్లా అనే వ్యక్తి ఒడిస్సా నుండి నవజీవన్ ట్రైన్ లో గంజాయి తీసుకొని అహ్మదాబాద్ కు వెళ్తున్న క్రమంలో పోలీస్ చెకింగ్ ఉందన్న భయంతో మహబూబాబాద్ రైల్వే స్టేషన్ లో దిగాడు. అక్కడ నుండి వరంగల్ వైపు వెళ్తున్న క్రమంలో మహబుబాబాద్ జిల్లా కేసముద్రం ఉప్పరపల్లి క్రాస్ వద్ద కేసముద్రం పోలీస్ లు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద 10కేజీల ఎండుగంజాయి పట్టుకున్నారు. సుమారు రూ. 2. 5లక్షల విలువ గంజాయి ని సీజ్ చేసి శనివారం అతన్ని రిమాండ్ కు తరలించారు.