
డోర్నకల్: ఘనంగా కోటి గోటి తలంబ్రాల శోభాయాత్ర
ఆధ్యాత్మిక సమితి అధ్వర్యంలో కోటి గోటి తలంబ్రాల శోభాయాత్ర ఆదివారం ఘనంగా నిర్వహించారు. శ్రీరామ నామంతో డోర్నకల్ పట్టణం మార్మోగింది. ఎండకు భక్తులకు ఎలాంటి ఇబ్బందులూ కలగకుండా వాటర్ ట్యాంకర్ ద్వారా రోడ్డును నీళ్ళతో తడిపారు. భక్తులకు మజ్జిగ ఏర్పాట్లు చేశారు. ప్రధాన రహదారిపై ఎక్కడ ట్రాఫిక్ అంతరాయం కలగకుండ స్థానిక ఎస్సై వంశీధర్ పర్యవేక్షణ చేశారు.