భారీ వర్షాలు.. సీఎం చంద్రబాబు కీలక సూచనలు
ఏపీలో 4 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపిందని సీఎం చంద్రబాబు తెలిపారు. చెరువులు, కాలువల వద్ద ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సోమవారం వర్షాలపై కలెక్టర్లు, మంత్రులు, అధికారులతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో చంద్రబాబు మాట్లాడారు. వర్షాలపై ప్రజలకు మెసేజ్‌లు పంపి అలర్ట్ చేయాలన్నారు. వాగులు, కాలువల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసి ప్రజా సమస్యలపై త్వరగా స్పందించాలన్నారు.