Top 10 viral news 🔥
వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకు వీఆర్ఎస్
విశాఖపట్నం స్టీల్ ప్లాంటు స్వచ్ఛంద పదవీ విరమణ పథకం (వీఆర్ఎస్) శనివారం ప్రకటించింది. ఇంకా ఏడాది సర్వీసు మిగిలి ఉన్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చునని పేర్కొంది. ఈ నెలాఖరులోగా దరఖాస్తు చేసుకుంటే మార్చిలోగా సెటిల్మెంట్ చేస్తామంది. ఎగ్జిక్యూటివ్‌లు 500, నాన్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగులు 500 మంది కలిపి తొలి విడత వీఆర్ఎస్ ఇస్తామంది. అయితే కనీసం 15 ఏళ్లు సర్వీసు, 45 ఏళ్ల వయసు ఉండాలని నిబంధన పెట్టింది.