నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన ‘డాకు మహారాజ్’ సినిమా విడుదల సందర్భంగా థియేటర్ల వద్ద తెల్లవారుజాము నుంచే అభిమానుల సందడి నెలకొంది. సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో థియేటర్ల వద్ద ఫ్యాన్స్ హంగామా చేస్తున్నారు. బాణాసంచా పేల్చి, కేక్ కట్ చేసి తినిపించుకుంటున్నారు. మాస్, క్లాస్ కలిస్తే డాకు అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతోంది.