వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం అన్నారం షరీఫ్ లో ఈనెల 16, 17వ తేదీలలో దర్గా ఉత్సవాలు ఉన్న సందర్భంగా ముస్లిం మాత పెద్దల సమక్షంలో బుధవారం నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి నల్లబెల్లి లోని వారి స్వగృహం లో అన్నారం షరీఫ్ దర్గాకు గిలాఫ్ సమర్పించారు. ఈ సందర్భంగా మత పెద్దలంతా పెద్ది సుదర్శన్ రెడ్డి మరియు నియోజకవర్గ ప్రజలంతా అల్లా దీవెనలతో నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని వేడుకున్నారు.