లగచర్లలో దళిత గిరిజన రైతులపై రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరుకు నిరసగా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ నేడు తలపెట్టనున్న మహాధర్నాకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆదేశాల మేరకు జనగాం జిల్లా పాలకుర్తి, దేవరుప్పుల, కొడకండ్ల మండలాల నుండి భారీగా తరలి వెళ్లారు. బీఆర్ఎస్ జిల్లా నాయకుడు పల్లా సుందర్ రాంరెడ్డి తదితరులు ఉన్నారు.