
పాలకుర్తి: రోడ్డు ప్రమాదంలో మైనర్ బాలుడు మృతి
పాలకుర్తి మండలం కొండాపూర్ గ్రామం దుర్గమ్మ గుడి సమీపంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మైనర్ బాలుడు మృతి చెందాడు. గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టడంతో ప్రమాదం జరిగి ఉండవచ్చని లేదా అతి వేగంగా వెళ్లడం వల్ల అదుపుతప్పి ప్రమాదం జరిగి ఉండవచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పెద్దతండా కె గ్రామానికి చెందిన ధరావత్ రమేష్ కుమారుడు దేవేందర్ (15) ప్రమాదంలో తీవ్రంగా గాయపడటంతో మృతి చెందాడు.