వరంగల్లో రాగి రేకులపై రాజ్యాంగం

80చూసినవారు
వరంగల్ కు చెందిన ఆరోగ్య శాఖ రిటైర్డ్ ఉద్యోగి వడ్డేపల్లి గోపాల్ రాజ్యాంగంపై తన అభిమానాన్ని చాటుకున్నారు. ఏడు నెలలపాటు శ్రమించి 260 రాగి రేకులపై రాజ్యాంగాన్ని ఆవిష్కరించారు. పలుచటి రాగి పత్రాలపై 2023 నవంబరులో మొదలు పెట్టి 2024 మే వరకు ఒక్కో అక్షరాన్ని చెక్కారు. దీని బరువు 18 కిలోల వరకు ఉంటుందని, రూ. 50 వేల వరకు ఖర్చయిందని గోపాల్ తెలిపారు. భారత అమృతోత్సవాల సందర్భంగా ఈ ఆలోచన వచ్చిందన్నారు

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you