
42వ డివిజన్ రంగశాయిపేటలో పండ్ల పంపిణీ
వరంగల్ నగరం 42వ డివిజన్ రంగశాయిపేట గవిచర్ల క్రాస్ రోడ్ సమీపంలో తెలంగాణ రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ-మురళీధర్ రావు రాజకీయ వారసురాలు కొండా సుష్మిత పటేల్ జన్మదినాన్ని పురస్కరించుకొని కొండా అభిమానులు మరియు కాంగ్రెస్ కార్యకర్తలు కేక్ కటింగ్ చేసి పండ్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 42వ డివిజన్ కార్పొరేటర్ గుండు చందన పూర్ణచందర్ తదితరులు పాల్గొన్నారు.