
ఏడాదిగా ఆమెతో డేటింగ్లో ఉన్నా: ఆమిర్‌ఖాన్
తన స్నేహితురాలు గౌరీ స్ప్రాట్‌తో ఏడాదిగా డేటింగ్లో ఉన్నట్లు బాలీవుడ్ నటుడు ఆమిర్‌ఖాన్ వెల్లడించారు. మార్చి 14న ఆమిర్‌ఖాన్ పుట్టినరోజు నేపథ్యంలో జరిగిన ప్రీ బర్త్ డే వేడుకలలో ఆయన పాల్గొన్నారు. కేక్ కట్ చేసిన ఆయన అనంతరం ఆయన మీడియాతో కాసేపు మాట్లాడారు. ఈ క్రమంలోనే తన డేటింగ్ విషయాన్ని తెలిపారు. 25 సంవత్సరాలుగా తనకు గౌరీ స్ప్రాట్ తెలుసని అన్నారు. స్ప్రాట్ ప్రస్తుతం బెంగుళూరులో నివశిస్తున్నారు.