వర్ధన్నపేట పెర్క వేడు నుంచి పర్వతగిరి మండలంలోని పైనే అన్నారం(షరీఫ్) వరకు రూ. 7 కోట్ల నిధులతో రోడ్డు విస్తరణ పనులకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గురువారం ప్రభుత్వ విప్ రామ చంద్రునాయక్, ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యే యశస్విని రెడ్డిలతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీఓ కిషన్, వివిధశాఖల అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.