అన్నారంలో 150మంది పోలిసులతో భద్రత ఏర్పాట్లు
పర్వతగిరి మండలం అన్నారంలో గురువారం ఉర్సు ఉత్సవాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. దర్గా పరిసరా ప్రాంతాలను కలర్ లైటింగ్ తో దర్గా ఆవరణలో సందడి నెలకొంది. ప్రతి ఏటా మూడు రోజుల పాటు జరిగే దర్గా ఉత్సవాలకు రాష్ట్ర మూలాల నుంచి భక్తులు వచ్చి యాకుబ్ షావళిని దర్శించుకోని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 52 సిసి కెమెరాలతో, 150మంది పోలిసు సిబ్బంది బందోబస్తు ఏర్పాటు చేశారు.