₹2లక్షల లోపు, ₹2 లక్షలపైన రుణమాఫీ కానివారి పరిస్థితి ఏమిటి?: హరీశ్

84చూసినవారు
రైతు రుణమాఫీపై తెలంగాణ రైతాంగాన్ని కాంగ్రెస్ దారుణంగా మోసం చేసిందని BRS నేత హరీశ్ రావు మండిపడ్డారు. తుమ్మల ప్రకటనతో రుణమాఫీ కథ ముగించే కుట్ర చేస్తున్నారని స్పష్టమవుతుందని ఫైర్ అయ్యారు. 'సీఎం మాటలు విని 2 లక్షల పైన రుణం ఉన్న రైతులు అప్పు చేసి, మిత్తితో సహా బ్యాంకులకు కట్టారు. ₹2 లక్షల లోపు రుణమాఫీ కాని వారి పరిస్థితి, ₹2లక్షల పైన రుణం ఉండి మాఫీ కాని రైతుల పరిస్థితి ఏమిటి? రైతులందరికీ రుణమాఫీ చేయాలి' అని డిమాండ్ చేశారు.