సింగపూర్ జెండా ఉన్న ఓడలో మాదకద్రవ్యాలు తరలిస్తూ భారతీయులు రాజు ముత్తుకుమారన్, సెల్వదురై దినకరన్, గోవిందసామి విమలకంధన్‌లు ఇండోనేషియా పోలీసులకు పట్టుబడ్డారు. పక్కా సమాచారం ఆధారంగా సోదాలు నిర్వహించి 106 కేజీల మాదకద్రవ్యాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు విచారణకు నిందితులు హాజరుకాలేదు. దీంతో వారికి మరణశిక్ష పడే అవకాశముందని వార్తలు వస్తున్నాయి. ఏప్రిల్ 15న తీర్పు వెలువడనుంది.